కావలసిన పదార్థాలు —
మామిడి కాయలు-5
పసుపు -2 స్పూన్స్
ఉప్పు - తగినంత
నువ్వుల నూనె —300 గ్రాములు
కారం—1/4 కిలో
మెంతిపిండి- 100 గ్రాములు
ఇంగువ -100. గ్రాములు
ఆవాలు-2 స్పూన్స్
ఎండుమిర్చి -5
తయారుచేయు విధానం —
ముందుగా మామిడి కాయలు బాగా కడిగి,పొడి గుడ్డ తో తుడుచుకుని, పొడవుగా సన్నగా తరిగి ఉప్పు, పసుపు వేసి తడిలేని జాడీ లో వేసి మూడురోజులు ఊరనివ్వాలి.తరువాత ముక్కలు పిండేసి,రసం విడిగా,ముక్కలు విడిగా రెండు రోజులు ఎండబెట్టి, రసం, ముక్కలు కలిపేసి కారం,మెంతిపిండి,వేసుకుని బాగా కలిపి, స్టవ్ మీద బాణాలి పెట్టి, వేడి చేసి , నూనె వేసుకొని బాగా వేడి అయ్యాక ఎండుమిర్చి,ఆవాలువేసి చిటపటలాడాక, ఇంగువ వేసి,స్టవ్ ఆపేసి పోపు చల్లార్చి అప్పుడు పచ్చడి లో కలిపి పచ్చడి పూర్తిగా చల్లారిన తరువాత జాడీ లో పెట్టుకోవాలి.అంతే పుల్ల పుల్లగా కారం కారం గా ఉండే మాగాయ రడీ.వేడి వేడి అన్నం లో నెయ్యి ,మాగాయ వేసుకుని తిని రుచిని ఆస్వాదించండి.
Thank you
SAIPADMAJA.
0 comments :
Post a Comment