శ్రీగణేశాయ నమః
————————
శ్రీరామ ఈ ఒక్క నామం చాలు.మన జీవితం సార్ధకం చేసుకోవడానికి.కైలాసం లో మహాదేవుడు ఎప్పుడూ తన మనస్సు లో శ్రీరామ నామం తో తపస్సు చేస్తూ ఉంటాడని పురాణోక్తి.ఆది దేవుడైన మహాదేవుడే శ్రీరామ నామం తో తరిస్తుంటే ,మామూలు మనషులం నిరంతరం సమస్యల తో కొట్టుమిట్టాడుతున్న మనం ఎంతగా రాముడితో మమేకం అవ్వాలి.
అందుకే ఈ శ్రీ రామనవమి నుంచీ అయినా రామనామ జపం చేద్దాం,మన జీవితాన్ని సఫలం చేసుకుందాం.
నిద్ర లేచింది మొదలు మళ్ళీ పడుకునే వరకు రామ నామం తో తరిద్దాం.హలో,హాయ్ లు మానేసి చక్కగా తెలుగు లో "జయ శ్రీరామ" అని పలకరించుకుందాం,అసలు సిసలు హిందువుగా తరిద్దాం.
భద్రాచలం లో రాములవారి కళ్యాణం చూస్తూ మనసులోనే రాములవారి పాదాలకు నమస్కరించుకుని రామనామం మొదలుపెట్టి తరిద్దాం. "జయశ్రీరామ".
భగవంతుని గురించి నా మొదటి వ్యాసం రాయడానికి నాకు జ్ఞానం ప్రసాదించిన నా సద్గురువు షిరిడీ సాయిబాబా కు,నాకు జన్మనిచ్చిన నామొదటి గురువు మాఅమ్మకు,నా ఆధ్యాత్మిక గురువు మా నాన్నగారికి,నన్ను బాగా ప్రభావితం చేసిన గురువుగారు చాగంటి గారికి,పాదాభివందనం చేసుకుంటూ వారికి నా వ్యాసం అంకితం.
జయశ్రీరామ
---------
సాయిపద్మజ
Home
»
Devotional
»
శ్రీరామనామ విశిష్టత.
0 comments :
Post a Comment