కావలసిన పదార్ధాలు
————————
గోంగూర— వొలిచిన ఆకులు 3 కప్పులు
టమాటోలు —3
ఉప్పు — తగినంత
కారం —4 స్పూన్స
్ ఆవపిండి —11/2 స్పూను
మెంతిపిండి —1/2 స్పూను
నూనె —4 స్పూన్స్
పచ్చిమిర్చి —3
కరివేపాకు —6 ఆకులు
పోపు సామాను.
ఇంగువ — 1/4 స్పూను
తయారి విధానం
———————
ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి వేడి చేసి ,2 స్పూన్స్ నూనె వేసి ,వేడి అయ్యాక బాగా కడిగి ఆరబెట్టిన గోంగూర ఆకులు వేసి, టమోటా ముక్కలు, ఉప్పు ,కారం ,ఆవపిండి ,మెంతిపిండి,వేసి బాగా కలిపి పచ్చడి దగ్గర పడేదాకా వేయించి ,చల్లార్చి పచ్చిమిర్చి వేసి మిక్సీ చేసి, పాన్ లో మిగతా నూనె వేసి, పోపు సామాను, ఇంగువ ,కరివేపాకు వేసి, మిక్సీ చేసిన పచ్చడి పాన్ లో వేసి, 4 నిముషాలు వేయించి, వేడి వేడి అన్నం లో నెయ్యి ముద్దపప్పు తో వడ్డించండి ,మీరూ ఆస్వాదించండి .
Thank you
SAIPADMAJA.
0 comments :
Post a Comment