శివ ప్రాతః స్మరణ స్తోత్రము .
శ్లో !!
ప్రాతః స్మరామి భవ భీతి హరం సురేశం
గంగాధరం వృషభ వాహన మంబికేశం !
ఖట్వాంగ శూల వరదా భయ హస్తమీశం
సంసార రోగ హర మౌషధ మ ద్వితీయమ్. !!
తా.
సంసార భయమును పోగొట్టు వాడును , దేవతలకు ప్రభువును , గంగను శిరమున
ధరించు వాడును , వృషభమును వాహనముగా గల వాడును , పార్వతీ నాధుడును ,
ధనస్సు , త్రిశూలము , వరద , అభయ ముద్రలు , చేతుల యందు ధరించిన వాడును
ఈశ్వరుడును , సంసార రోగమును హరింప జేయుట యందు ఔషధము వంటి
వాడును , అద్వితీయుడును అగు పరమ శివుని పారాతః కాలమున నేను
స్మరించుచున్నాను .
0 comments :
Post a Comment