Enjoy cooking
Browse through over
650,000 tasty recipes.
Home » » చింతకాయ పచ్చడి ( నా స్టైల్లో)

చింతకాయ పచ్చడి ( నా స్టైల్లో)

కావాల్సిన పదార్ధాలు
 ———————
చింతకాయలు —1/4 కిలో
 ఎండుమిరపకాయలు —50 గ్రామ్స్(10 )
మినప పప్పు —2 స్పూన్స్ 
శనగపప్పు —2 స్పూన్స్
ఆవాలు—1 స్పూను
మెంతులు—1/2 స్పూను
ఉప్పు— తగినంత
 ఇంగువ—1 1/2 స్పూను
నూనె —1/2 కప్పు
పచ్చిమిర్చి —8 
కరివేపాకు —1 రెమ్మ
పసుపు —1/2 స్పూను
 తయారి విధానం
 —————— 
స్టవ్ మీద పాన్ పెట్టి వేడి అయ్యాక 1/4 కప్పు నూనె వేసి,ఎండుమిరపకాయలు ,మినప పప్పు, శనగపప్పు,ఆవాలు ,మెంతులు ,1/2 స్పూను ఇంగువ వేసి, వేగిన తరువాత ,చల్లార్చి మెత్తగా  మిక్సి చేసి ,చింతకాయల ను   చిన్న ముక్కలు చేసి మిక్సి లో వేసి, ఉప్పు ,పసుపు వేసేసి పాన్ లో మిగిలిన నూనె కూడా  వేసి బాగా మిక్సి చేసుకుని, ఇప్పుడు 6 పచ్చిమిర్చి కూడా వేసి మిక్సి చేసి గిన్నె లోకి తీసుకుని 2 పచ్చిమిర్చి ని చిన్న చిన్న ముక్కలు గ తరిగి వేసి  ,పాన్ పెట్టి మిగతా నూనె వేసేసి ఎండు మిర్చి ,కొద్దిగా మినప పప్పు, శనగపప్పు ,ఆవాలు కొద్ది ఇంగువ,కరివేపాకు  వేసి మిగిలిన ఇంగువ పచ్చడి  మీద వేసి దాని మీద పోపు వేసేసి వేడి వేడి అన్నం ,నెయ్యి , ముద్దపప్పు  తో వడ్డించండి .మీరు ఆస్వాదించండి . 
         Thank you
                           SAIPADMAJA.

SHARE

About Unknown

2 comments :