కావాల్సిన పదార్ధాలు
————————
దొండకాయలు—1/4 కిలో
పల్లీలు—100 గ్రామ్స్
ఎండుకొబ్బరి —3 స్పూన్స్
నూనె — డీప్ ఫ్రై కి సరిపడినంత
ఉప్పు —, తగినంత
కారం—1 స్పూను
తయారి విధానం
——————
దొండకాయలు సన్నగా పొడవుగా నాలుగేసి ముక్కలు గా తరిగిపెట్టుకోవాలి .స్టవ్ మీద పాన్ పెట్టి నూనె పోసి కాగనివ్వాలి, ముందుగా పల్లీలు వేయించి పక్కన పెట్టుకోవాలి .ఇప్పుడు దొండకాయ ముక్కలు కొన్ని కొన్ని వేసి డీప్ ఫ్రై చేసుకుని, పాన్ లో కొంచెం నూనె ఉంచి ,వేయించిన దొండకాయ ముక్కలు, పల్లీలు ఉప్పు,కారం,ఎండుకొబ్బరి వేసి బాగా కలిపి వేడి వేడి అన్నం తో వడ్డించండి ,మీరూ ఆస్వాదించండి .
0 comments :
Post a Comment