Enjoy cooking
Browse through over
650,000 tasty recipes.
Home » » కార్తీక పురాణం—30

కార్తీక పురాణం—30

కార్తీక మాసం 30వ అధ్యాయం : ఫలశ్రుతి

నైమిశారణ్య ఆశ్రమంలో శౌనకాది మహామునులందరికీ సూతమహర్షికార్తీక వ్రత మహిమా ఫల శ్రుతిని తెలియజేశారు. విష్ణు మహిమ, విష్ణుభక్తుల చరిత్రలను విని అంతా ఆనందించారు. వేయినోళ్ల సూతమహర్షినికొనియాడారు. శౌనకాది మహామునులకు ఇంకా సంశయాలుతీరకపోవడంతో సూత మహర్షిని చూసి ”ఓ మహాముని! కలియుగంలోప్రజలు అరిషడ్వర్గాలకు దాసులై, అత్యాచారపరులై జీవిస్తున్నారు. సంసారసాగరంలో తరించలేకపోతున్నారు. అలాంటి వారికి సులభంగా ఆచరించేవ్రతాలేమైనా ఉన్నాయా? ఉంటే మాకు వివరించండి. ధర్మాలన్నింటిలోమోక్ష సాధనకు ఉపకరించే ఉత్తమ ధర్మమేదో సెలవివ్వండి.దేవతలందరిలో ముక్తిని కలిగించే దైవం ఎవరో చెప్పండి. మానవుడినిఆవరించిన అజ్ఞానాన్ని రూపుమాపి, పుణ్యఫలమిచ్చే కార్యమేమిటోతెలపండి. ప్రతిక్షణం మృత్యువు వెంటాడుతున్న మానవులకు సులభంగామోక్షం పొందగల ఉపాయమేమిటి? హరినామస్మరణ సర్వదా చేస్తున్నా…మేము ఈ సంశయాల్లో కొట్టుమిట్టాడుతున్నాం. కాబట్టి మాకు వివరించి,మమ్మల్ని ఉద్దరించండి” అని కోరారు.

దానికి సూత మహర్షి ఇలా చెబుతున్నారు… ”ఓ మునులారా! మీకు కలిగినసంశయాలు తప్పక తీర్చుకోవాల్సినవే. కలియుగంలో మానవులుమందబుద్ధులు. క్షణికములైన సుఖాలతో నిండిన సంసార సాగరందాటేందుకు మీరు అడిగిన ప్రశ్నలు దోహదపడతాయి. మోక్షసాధనలుగాఉంటాయి. కార్తీక వ్రతం వల్ల యాగాది క్రతువులు చేసిన పుణ్యం, దాన ధర్మఫలాలు చేకూరుతాయి. కార్తీక వ్రతం శ్రీమన్నారాయణుడికి అత్యంతప్రీతికరమైన వ్రతం. ఇది అన్ని వ్రతాల కంటే ఘనమైనదని ఆ శ్రీహరేసెలవిచ్చారు. ఆ వ్రత మహిమ వర్ణించడానికి నాకు శక్తి సరిపోదు.అంతేకాదు. సృష్టికర్త అయిన ఆ బ్రహ్మదేవుడికి కూడా శక్యం కాదు.అయినా… సూక్షంగా వివరిస్తాను. కార్తీకమాసంలో పాటించాల్సినపద్ధతులను గురించి చెబుతాను. శ్రద్ధగా వినండి. కార్తీకమాసంలోసూర్యభగవానుడు తులారాశిలో ఉనప్పుడు శ్రీహరి ప్రీతికోసం మనకుముక్తి కలగడానికి తప్పనిసరిగా నదీస్నానం ఆచరించాలి. దేవాలయానికివెళ్లి హరిహరాదులను పూజించాలి. తనకున్న దాంట్లో కొంచెమైనాదీపదానం చేయాలి. ఈ నెలరోజులు విధవ వండిన పదార్థాలు తినరాదు.రాత్రులు విష్ణువాలయాల్లోగానీ, శివాలయాల్లోగానీ ఆవునేతితో దీపారాధనచేయాలి. ప్రతిరోజు సాయంకాలం పురాణ పఠనం చేయాలి. ఈ విధంగాచేయడం వల్ల సకల పాపాల నుంచి విముక్తులై సర్వ సౌక్యాలనుఅనుభవిస్తారు. సూర్యుడు తులారాశిలో ఉన్న ఈ నెలరోజులు ఈ విధంగాపద్ధతులు పాటించేవారు జీవన్ముక్తులవుతారు. ఇలా ఆచరించే శక్తి ఉన్నా..ఆచరించక పోయినా… భక్తి శ్రద్ధలతో కార్తీక నియమాలను పాటించేవారినిఎగతాళి చేసినా… ధన సహాయం చేసేవారికి అడ్డుపడినా… వారుఇహలోకంలో అనేక కష్టాలను అనుభవించడమేకాకుండా…. వారిజన్మాంతరంలో నరకంలోపడి కింకరులచే నానా హింసలపాలవుతారు.అంతేకాకుండా… వారు నూరు హీనజన్మలెత్తుతారు.

కార్తీకమాసంలో కావేరీ, గంగా, అఖండ గౌతమి నదుల్లో స్నానం చేసి,ముందు చెప్పిన విధంగా నిష్టతో కార్తీక నియమాల్ని పాటించేవారుజన్మాంతరాన వైకుంఠ వాసులవతుతారు. సంవత్సరంలో వచ్చే అని నెలల్లోకార్తీక మాసం ఉత్తమమైనది. అధిక ఫలదాయకమైనది. హరిహరాదులకుప్రీతికరమైనది కాబట్టి కార్తీక మాస వ్రతం వల్ల జన్మజన్మల నుంచి వారికున్నసకల పాపాలు తొలగిపోతాయి. నియమ నిష్టలతో కార్తీక వ్రతంఆచరించేవారు జన్మరాహిత్యాన్ని పొందుతారు. ఇలా నెలరోజులునియమాలు పాటించలేనివారు కార్తీక శుద్ధ పౌర్ణమినాడు తమ శక్తికొలదీవ్రతమాచరించి, పురాణ శ్రవణం చేసి, జాగారం ఉండి…. మర్నాడు ఒకబ్రాహ్మణుడికి భోజనం పెడితే… నెలరోజులు వ్రతం చేసిన ఫలితంలభిస్తుంది. ఈ నెలలో ధనం, ధాన్యం, బంగారం, గృహం, కన్యాదానంచేసినట్లయితే… ఎన్నటికీ తరగని పుణఫ్యం లభిస్తుంది. ఈ నెలరోజులుధనవంతుడైనా, పేద అయినా.. మరెవ్వరైనా హరినామ స్మరణనునిరంతరం చేయాలి. పురాణాలు వింటూ, పుణ్యతీర్థాలను సేవిస్తూ దానధర్మాలుచేయాలి. అలా చేసేవారు పుణ్యలోకాలను పొందుతారు. ఈకథను చదివినవారికి శ్రీమన్నారాయణుడు సకలైశ్వర్యాలను ఇచ్చి, వైకుంఠప్రాప్తి కలిగిస్తాడు.

ఇతి శ్రీ స్కాంధ పురాణాంతర్గత వశిష్ట సంప్రోక్త కార్తీక మహత్యమందలిత్రింశోధ్యాయం సమాప్తం

ముప్ఫైయవరోజు (ఆఖరి రోజు) పారాయణం సమాప్తం

ఓం సర్వేషాం స్వస్తి ర్భ వతు ఓం సర్వేషాం శాంతి ర్భ వతు

ఓం సర్వేషాం పూర్ణం భవతు ఓం శ్శాంతి శ్శాంతి::||

కార్తీకపురాణం – 30వ అధ్యాయం : ఫలశ్రుతి

SHARE

About Unknown

0 comments :

Post a Comment