Enjoy cooking
Browse through over
650,000 tasty recipes.
Home » » శని దోష పరిహారం

శని దోష పరిహారం

ఏలినాటి శని దోషపరిహారానికి ఉపాయం ..?

శనివారం ఉదయం తలస్నానం (తైలా భ్యం గనస్నానం) చేసి, నువ్వులు దానం చేసి... నె య్యి, నూనె, ఆముదం కలిపిన నూనెలో ఎరు పు, తెలుపు, నలుపు, కలిసిన వత్తివేసి పడమ ట దిక్కున ఇనుపగరిటలో శనిదీపం పెట్టి దా నికి నువ్వులు, బెల్లం నైవేద్యం పెట్టాలి. లేదా శని వ్రతం (బ్రాహ్మణులను సంప్రదిస్తే... ఎలా చేయాలో చెప్పి చేయిస్తారు) చేయాలి. ఇక శని స్త్రోత్రం ప్రతిదినం ప్రాతఃకాలంలో పఠిస్తే... ఏలినాటి శని బాధ తొలిగిపోతుంది.

శని స్త్రోత్రం:
కృష్ణస్థః పింగళో భభ్రుః
కృష్ణో రౌద్రంత కో యమః
సౌరిః శనైశ్చరో మందః
పిప్పలాదేవ సంస్తుతః
నమస్తే కోణ సంస్థాయ
పింగళాయ నమస్తుతే
నమస్తే భభ్రురూపాయ
కృష్ణాయచ నమస్తుతే
నమస్తే రౌద్ర దేహాయ
నమస్తే చాంతకాయచ
నమస్తే యమ సంజ్ఞాయ
శనైశ్చర నమస్తుతే
ప్రసాదం కురు దేవేశ
దీనస్య ప్రణతస్యచ

SHARE

About Unknown

0 comments :

Post a Comment