మన ఇంట్లో మిర్చి బజ్జి
—————————
కావలసిన పదార్ధాలు
————————
బజ్జి మిర్చి— 15
శనగపిండి—1/4 కిలో
అమచూర్ పౌడర్ —4 స్పూన్స్
వాము —2 స్పూన్స్
ఉప్పు — తగినంత
వంటసోడా —1/4 స్పూను
నూనె — డీప్ ఫ్రై కి సరిపడా
తయారివిధానం
——————
ముందుగా పచ్చిమిర్చి కి పొడవుగా గాటు పెట్టి గింజలు తీసేయాలి .మిక్సీ లో వాము,ఆమచూర్ పౌడర్ వేసి మెత్తగా చేసిపెట్టుకోవాలి. అందులో ఉప్పు ,1 స్పూను శనగపిండి వేసి, కొద్దిగా నీళ్ళు కలిపి పేస్టు లా చేసి ,మిర్చి మధ్యలో కూరాలి.మిగిలిన పేస్టు ని శనగపిండి లో వేసేసి ఉప్పు ,వంటసోడా వేసేసి నీళ్ళు పోసి బజ్జి పిండిలా కలిపి పక్కన పెట్టుకోవాలి . ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి డీప్ ఫ్రై కి సరిపడా నూనె వేసి,బాగా వేడెక్కాక ,మిర్చి లను పిండి లో ముంచి నూనె లో వేసి, రెండు వైపులా బాగా వేగనిచ్చి, పుదీనా చట్నీ తో వేడి వేడిగా వడ్డించండి. మీరూ ఆస్వాదించండి.
THANK YOU
SAIPADMAJA.
0 comments :
Post a Comment