కావలసిన పదార్ధాలు
————————
పిజ్జా బేస్ —2
టమాటోలు —4
ఆరిగానో —2 స్పూనులు
ఉప్పు — కొంచెం
నూనె —1 స్పూను
కాప్సికం — చిన్నది —1
ఉల్లిపాయలు —2
పిజ్జా చీజ్ —100 gr
చిల్లి ఫ్లేకెస్—1 స్పూను
తయారి విధానం
——————-
ముందుగా ఓవెన్ 180° కి 6 ని"ప్రీహీట్ సెట్ చేసి ,స్టవ్ మీద పాన్ పెట్టి నూనె వేసి ,సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ వేసి ,3 టమాటోలు మిక్సీ చేసి వేసి,ఉప్పు ,ఆరగానో,( ఆరగానో లేకపోతే మనం పూలదండలో వాడే మరువం ఎండబెట్టి చేత్తో నలిపి సీసాలో పెట్టుకుంటే ఆరగానో బదులు వాడుకోవచ్చు ) వేసి దగ్గర పడేదాకా ఉంచి, ఇప్పుడు పిజ్జా బేస్ మీద మనం తయారుచేసిన టమాటో మిశ్రమం రాసి సన్నగా పొడవుగా తరిగిన టమాటో,ఉల్లిపాయ, కాప్సికం ముక్కలు పెట్టి, ఆరగానో ,చిల్లి ఫ్లేకెస్ వేసి, తురిమిన పిజ్జా చీజ్ ,పిజ్జా అంతా కవర్ అయ్యేలాగ వేసి ఓవెన్ లో 12 ని " పెట్టండి. పిజ్జా అవగానే సాస్ తో వేడి గా సర్వ్ చెయ్యండి ,మీరూ ఆస్వాదించండి .
Thank you
SAIPADMAJA
0 comments :
Post a Comment