కావాల్సిన పదార్ధాలు
————————
టమోటాలు— 1/4 కిలో
ఆవపిండి —1 స్పూను
మెంతి పిండి —1/2 స్పూను
ఉప్పు — తగినంత
కారం —3 స్పూన్స్
నూనె —3 స్పూన్స్
పోపుసామాను
ఇంగువ —1/4 స్పూను
తయారి విధానం
——————
ముందుగా టమోటాలను మిక్సీ చేసుకోవాలి.స్టవ్ మీద పాన్ పెట్టి 2 స్పూన్స్ నూనె వేసి,చిటికెడు ఇంగువ వేసి ,మిక్సీ చేసిన టమోటా గుజ్జు ,ఉప్పు, కారం,ఆవపిండి ,మెంతిపిండి వేసేసి బాగా కలిపి నూనె పైకి వచ్చేవరకు ఉంచి,వేరే పాన్ లో మిగతా నూనె, పోపు సామాను వేసి,ఇంగువ అంత వేసి, పచ్చడి లో వేసేసి బాగా కలిపి, వేడి అన్నం, నెయ్యి లేదా నూనె తో వడ్డించండి ,మీరూ ఆస్వాదించండి .
0 comments :
Post a Comment