కావాల్సిన పదార్ధాలు
—————————
పన్నీర్ —200 గ్రామ్స్
బటర్ —2 స్పూన్స్
టమాటోలు — 5
ఉల్లిపాయలు —2
అల్లం — చిన్నముక్క
పచ్చిమిర్చి —3
జీడిపప్పు పేస్టు —1/4 కప్పు
గరంమసాల —1 స్పూను
జీరాపౌడర్ —1 స్పూను
ధనియా పౌడర్ —1 స్పూను
కసూరిమేతి —1/2 స్పూను
క్రీం —1 స్పూను
ఉప్పు — తగినంత
కారం —1 స్పూను
నూనె —3 స్పూన్స్
తయారివిధానం
—————
స్టవ్ మీద పాన్ పెట్టి నూనె వేసి ,బటర్ 1 స్పూను వేసి ,మిక్సీ లో టమాటోలు ,ఉల్లిపాయలు, అల్లంపచ్చిమిర్చి వేసి మెత్తగా మిక్సీ చేసుకుని ,ఈ పేస్టు ని పాన్ లో వేసుకుని 5 నిముషాలు వేయించి ,జీడిపప్పు పేస్టు కూడా వేసి ,ఉప్పు, కారం ,గరం మసాలా ,జీరా పౌడర్, ధనియా పౌడర్, వేసి 5 నిముషాలు ఉడకనిచ్చి ,పన్నీరు ముక్కలు వేసి కలిపి 2 నిముషాలు ఉంచి ,కసూరిమేతి ,బటర్ వేసి బాగా కలిపి క్రీం వేసి వేడిగా వడ్డించండి ,మీరు ఆస్వాదించండి .ఈ పన్నీర్ బటర్ మసాలా బిర్యానీ లో,రోటి లో చపాతీ లోకి అన్నిటిలోకి చాలా బావుంటుంది .ట్రై చెయ్యండి .నచ్చితే కామెంట్ పెట్టండి .
Thank you
SAIPADMAJA.
0 comments :
Post a Comment