Enjoy cooking
Browse through over
650,000 tasty recipes.
Home » » బెండకాయ గ్రీన్‌ మసాలా కర్రీ

బెండకాయ గ్రీన్‌ మసాలా కర్రీ

బెండకాయ గ్రీన్ మసాలా కర్రీ———————————
కావలసిన పదార్ధాలు 
———————--
బెండకాయ ముక్కలు — 2 కప్పులు
 ఉల్లిపాయ ముక్కలు ( పెద్దవి)—1కప్పు 
టమోట ముక్కలు —11/2 కప్పు
అల్లం — చిన్న ముక్క
పచ్చిమిర్చి— 3
పుదీనా —1/2 కట్ట
కొత్తిమీర —2 కట్టలు
 పెరుగు — 1 కప్పు
గరం మసాలా —1స్పూను 
ధనియా  పౌడర్ —2 స్పూన్స్ 
జీరా పౌడర్ —1 స్పూను
 గ్రీన్ చిల్లి సాస్ —2 స్పూన్స్
నూనె—4 స్పూన్స్
ఉప్పు—తగినంత 

తయారి విధానం 
——————
ముందుగా పాన్ లో నూనె వేసి, బెండకాయ ముక్కలు దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి .ఇప్పుడు మిక్సీ లో ఉల్లిపాయ ముక్కలు, టమోటా ముక్కలు, అల్లం,పుదీనా ,కొత్తిమీర ,పచ్చిమిర్చి,పెరుగు అన్నీ వేసి మెత్తగా మిక్సీ చేస్కుని, పాన్ లో మిగిలిన నూనె లో మిక్సీ చేసిన పేస్టు వేసి 5 నిముషాలు వేయించి, గరం మసాలా,గ్రీన్‌  చిల్లి పేస్టు, ధనియా పౌడర్ ,జీరా పౌడర్,ఉప్పు వేసి బాగా కలిపి వేయించిన బెండకాయ ముక్కలు వేసేసి ,బాగా కలిపి నూనె పైకి తేలే వరకు ఉంచి పాన్ లోంచి సెర్వింగ్ డిష్ లోకి తీసుకుని, కొత్తిమీర తో గార్నిష్ చేసి ,రోటి, అన్నం, బిర్యానీ ఎందులోకైనా బావుంటుంది. వేడి గా వడ్డించండి ,మీరూ ఆస్వాదించండి .

SHARE

About Unknown

0 comments :

Post a Comment