మైసూర్ బజ్జి
-------------
కావలసిన పదార్ధాలు
--------------------—--
మైదా -2 కప్పులు
మినప పిండి -1/2 కప్పు
ఉప్పు - తగినంత
పెరుగు -1 కప్పు
వంటసోడా -1/4 స్పూన్
పచ్చిమిర్చి ముక్కలు -1 స్పూను
ఉల్లిపాయ చిన్న ముక్కలు -1/4 కప్పు
నూనె-డీప్ ఫ్రై కి సరిపడా
తయారి విధానం
-------------------
ఒక గిన్నె లో
మైదా, ఉప్పు ,మినప పిండి ,వంటసోడా ,పెరుగు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలిపి,ఒక గంట నాననివ్వాలి .తరువాత స్టవ్ మీద బాండీ పెట్టి ,నూనె పోసి బాగా కాగానిచ్చి ,స్పూన్ తో జాగర్తగా గుండ్రం గా వచేట్టు కొద్ది కొద్దిగా పిండి ని వేసుకుని బంగారు రంగు వచ్చేవరకు వేయించి కొబ్బరి, పుట్నాల తో చేసిన చట్నీ తో వేడి వేడి గా వడ్డించండి ,మీరు ఆస్వాదించండి .
Thank you
SAIPADMAJA
0 comments :
Post a Comment