కావలసిన పదార్ధాలు
————————
పన్నీర్-100 గ్రా
కాప్సికం -1 పెద్దది
ఉల్లిపాయ- 1 పెద్దది
టమోటా -1 పెద్దది
గట్టి పెరుగు -1కప్పు
గరం మసాలా- 1 స్పూను
ధనియా పౌడర్ -1స్పూను
జీర పౌడర్ -1 స్పూను
ఉప్పు - తగినంత
కారం- 1 స్పూను
నిమ్మరసం -1/2 స్పూను
చాట్ మసాలా -2 పించ్
నూనె-3 స్పూన్స్
తయారి విధానం
——————
ముందుగా ఒక గిన్నెలో పెరుగు, ధనియా పౌడర్ ,జీరా పౌడర్, గరం మసాలా, ఉప్పు,కారం అన్ని వేసి, బాగా కలిపి ,పన్నీర్ క్యుబ్స్ ,కాప్సికం ,టమోటా ,ఉల్లిపాయ ముక్కలు అన్ని వేసి బాగా కలిపి ఫ్రిజ్ లో అరగంట సేపు ఉంచి నాననివ్వాలి.ఇప్పుడు బార్బీ క్యు స్టిక్స్ కి, ముందుగా ఉల్లిపాయ ముక్క గుచ్చి పన్నీర్, టమోటా, కాప్సికం ముక్కలు వరుస గా గుచ్చి పైన కొంచెం నిమ్మరసం పిండి ఉంచాలి.పాన్ వేడి చేసి,కొద్దిగా నూనె వేసి స్టిక్స్ పెట్టి మధ్య మధ్య లో అటు ఇటు తిప్పుతూ కొంచెం నూనె వేస్తూ,3 నిముషాలు మూత పెట్టి ,మరోసారి స్టిక్స్ తిప్పి 2 నిముషాలు ఉంచి ప్లేట్ లోకి తీసుకుని పైన కొద్దిగా నిమ్మరసం ,చాట్ masala వేసి వేడిగా వడ్డించండి ,మీరు ఆస్వాదించండి. THANK YOU
SAIPADMAJA
0 comments :
Post a Comment