________________
కావలసిన పదార్ధాలు
_________________
బెండకాయ ముక్కలు -1 పెద్ద కప్పు
ఉల్లిపాయ ముక్కలు -1 కప్పు
టమోటా ముక్కలు 1 కప్పు
పెరుగు -1 కప్పు
కొత్తిమీర -2 కట్టలు
పుదీనా - 1 కట్ట
పచ్చిమిర్చి -3
అల్లం - చిన్న ముక్క
కసూరి మేతి,-1స్పూను
ధనియా పౌడర్ -1 స్పూన్
జీరా పౌడర్ -1 స్పూన్
గరం మసాలా -1 స్పూన్
.ఎవరెస్ట్ కిచెన్ కింగ్ మసాలా - 2 స్పూన్స్
నూనె -3 స్పూన్స్
తయారి విధానం
______________
ముందుగా పాన్ వేడి చేసి 1/2 స్పూన్ నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి, కొద్దిగా వేయించి ,మిక్సీలో వేసి టమోటా ముక్కలు, కొత్తిమీర ,పుదీనా ,అల్లం,పచ్చిమిర్చి వేసి అన్ని మెత్తగా మిక్సీ చేసి ,పాన్ లో 2 స్పూన్స్ ఆయిల్ వేసి బెండకాయ ముక్కలు వేయించి పక్కన పెట్టుకోవాలి ,అదే ఆయిల్ లో మిక్సీ చేసిన పేస్టు వేసి బాగా వేయించి,పెరుగు స్పూన్ తో బాగా బీట్ చేసి వెయ్యాలి ,ఇపుడు పెట్టుకున్న మసాలా పొడులు అన్నీ వేసి, బెండకాయ ముక్కలు వేసేసి ,బాగా కలిపి ఆయిల్ పైకి తేలేవరకు సిమ్ లో ఉంచి ,కసూరి మేతి వేసి కలిపి వేడి గా రోటి తో కానీ అన్నం తో కాని వడ్డించండి ,మీరు ఆస్వాదించండి.
Nice description,yummy......
ReplyDeleteNice description,yummy......
ReplyDeleteThank you
ReplyDelete