కావలసిన పదార్ధాలు
————————
బ్రౌన్ బ్రెడ్ —1 పాకెట్
చీజ్ స్లైస్ —10
క్యారెట్స్—2
ఆలూ —2
బీన్స్ —8
బఠానీలు —100 గ్రామ్్స
క్యాప్సికం —1 పెద్దది
టమోటాలు —2
ఉల్లిపాయలు —2
పుదీనా—1 కట్ట
కొత్తిమీర —1 కట్ట
నూనె—4 స్పూన్స
్ ఉప్పు — తగినంత
కారం—1 స్పూను
గరం మసాలా —1 స్పూను
తయారి విధానం
——————
ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి ,2 స్పూన్స్ నూనె వేసి ,ఉల్లిపాయ ముక్కలు, టమోటా ముక్కలు,తరిగిన పుదీనా ,కాప్సికం ముక్కలు , ఉప్పు వేసి, బాగా కలిపి మూత పెట్టి, కుక్కర్ లో ఆలూ ముక్కలు ,క్యారెట్ ముక్కలు,బఠానీలు ,బీన్స్ ముక్కలు వేసి నీళ్ళు పోసి పెట్టి, 3 విసిల్స్ వచ్చేదాకా ఉంచి ,ఆవిరి దిగాక ,పాన్ లో ఉన్న కూర లో వేసేసి,కారం ,గరం మసాలా, కొత్తిమీర కూడా వేసి బాగా కలిపి మాష్ చెయ్యాలి . ఇప్పుడు బ్రౌన్ బ్రెడ్ మీద మాష్ చేసిన కూర, చీజ్ స్లైస్ పెట్టి పైన బ్రెడ్ స్లైస్ తో కవర్ చేసి పాన్ లో కొంచెం నూనె వేసి రెండు వైపులా కాల్చి క్రాస్ గా కట్ చేసి,వడ్డించండి .మీరూ ఆస్వాదించండి .
Thank you
SAIPADMAJA
0 comments :
Post a Comment